బండారు దత్తాత్రేయకు అస్వస్థత.. అపోలో ఆసుపత్రికి తరలింపు

  • ఛాతీ నొప్పితో విలవిల్లాడిన దత్తాత్రేయ
  • హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
  • ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న పార్టీ శ్రేణులు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాదులోని తన నివాసంలో ఛాతీనొప్పి రావడంతో ఆయన విలవిల్లాడారు. దీంతో, కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో బీజేపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

Bandaru Dattatreya
BJP
Governor
Heart Attack

More Telugu News